- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానసిక ఆరోగ్యంపై ఉచిత అవగాహన ఇచ్చే సంస్థ
ఏవిటో ఈ కాలం పిల్లలు అస్సలు శ్రద్ధగా చదువుకోరని పెద్దలు.. ఈ పేరెంట్స్‌కి మన సమస్యలు అస్సలు అర్థం కావు అని పిల్లలు.. నేటి

ఏవిటో ఈ కాలం పిల్లలు అస్సలు శ్రద్ధగా చదువుకోరని పెద్దలు.. ఈ పేరెంట్స్‌కి మన సమస్యలు అస్సలు అర్థం కావు అని పిల్లలు.. నేటి విద్యార్థులు కేవలం పాఠశాల చదువులతోనే కాదు, వారి కలలు, తోటి విద్యార్థులతో పోటీ, తల్లిదండ్రుల ఆశలు, స్వీయ లక్ష్యాలతో కూడిన ఒత్తిడితో నలుగుతున్నారు. అన్ని వైపుల నుంచి వచ్చే ఈ ఒత్తిడి, ఒక మానసిక టగ్-ఆఫ్-వార్‌లా మారి, తీవ్ర మానసిక ఆందోళనకు, ఒత్తిడికి దారితీస్తుంది. వాళ్లు కోరుకున్న ఉద్యోగం సాధించిన తర్వాత కూడా, ఉద్యోగ భద్రతపై భయం, ఆ ఉద్యోగం అంచనాలను నిలబెట్టుకోవాలన్న ఒత్తిడి వారికి నిత్య సవాలుగా మారుతుంది. విజయం అనేది ప్రశాంతతను ఇవ్వకపోవచ్చు. కానీ కొన్నిసార్లు, అది మౌనంగా ఒత్తిడిని తెస్తుంది.
ప్రేమరాహిత్యంతోటే ఆత్మహత్యలు..
ఇవాళ అనేక సంబంధాలు, వివాహ సమస్యలు అనవసరమైన అంచనాలు, ఇతరులతో చేసే పోలికల వల్ల పెరుగుతు న్నాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో చూసే fake stories, ప్రేమ క్రమంగా తగ్గిపోవడం అవుతుంది. సంబంధాలు అర్థం చేసుకోవడం కాకుండా అంచనాలు, పోలికలపై నిర్మితమైతే, అవి తేలిపోతున్నాయి. భావో ద్వేగాలు, సమయం, ఆర్థికంగా కూడా నష్టం కలుగజేస్తాయి. చివరికి వ్యక్తులు మానసికంగా విసిగిపోయి, ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతారు. జీవితం ఎక్కడికి పోతుందో అర్థం కాక అయోమయంలో మిగిలిపోతారు.
నిజమైన సహాయం అదే..
ఈ సమస్యలు మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. మన జీవితంలో మన కుటుంబాల్లో, పొరుగు వారిలో, సమాజంలో ఒక వ్యక్తిగా, ముందుగా మన మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే మొదటి అడుగు. అప్పుడు మాత్రమే మనం నిజమైన సహాయాన్ని కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి అందించగలుగుతాం.
మార్పు రావాలంటే..
మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం ద్వారా భావోద్వేగ సమస్యలపై నిశ్శబ్దాన్ని తొలగించడం ద్వారా మనం మార్పు తీసుకురాగలం. తల్లిదండ్రులు, తోబుట్టువులు, గురువులు, స్నేహితులతో ఓపికతో మాట్లాడడం ఒక పెద్ద మార్పుని తెస్తుంది. ఒకరు చెప్పిన బాధను వినడం కూడా వారి ఒత్తిడిని తక్కువ చేస్తుంది, బతకాలని ఆశ నింపుతుంది. చిన్న మాటలు, ఒకరిని బతికించే శక్తిగా మారవచ్చు. భారతదేశంలో ఏటా సుమారు 1.71 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 28% ఆత్మహత్యల రేటు ఉంది.
28 ఏళ్లుగా నిరంతర సేవలు..
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'రోషిని సంస్థ' పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలు, కార్పొరేట్ సంస్థల్లో అవగాహనను పెంపొందిస్తోంది. గత 28 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలు అందిస్తోంది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనే వాళ్లని గుర్తించి వారికి జీవితంపై ఆశలు కల్పించడం ద్వారా ఆ ఆలోచనలను దూరం చేయవచ్చు. ఆత్మహత్య అంచుల వరకు వెళ్లిన వారిని కూడా రోషిణి సంస్థ వారు కాపాడారు. రకరకాల బాధలు ఇబ్బందులతో క్షణికావేశంతో ఈ ఆలోచనలోకి వెళ్లిన వారికి సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్ ద్వారా ఉచిత మందులు అందిస్తారు.
ఉచితంగా, గోప్యంగా సహాయం
రోషిణి అనే సంస్థ ఎవరికైనా ఉచితంగా, గోప్యంగా భావోద్వేగ సహాయాన్ని అందించే స్వచ్చంద సంస్థ. ఈ సంస్థలో 70 మందికి పైగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఉన్నారు. ఉదయం 11 నుండి రాత్రి 9 వరకు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సంప్రదించాలనుకున్న వారు కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్స్‌ను సంప్రదించవచ్చు.
(నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం)
- రోషిణి ఆత్మహత్యల నివారణ సంస్థ
040- 6620 2000






