వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి!

by Ravi |   (  Updated:2025-06-04 00:45:21  IST  )

వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తున్నాయి. రైతులు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమని స్తున్నారు. కొత్త తరహా

వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలి!
X

వ్యవసాయ రంగంలో కీలక మార్పులు వస్తున్నాయి. రైతులు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను గమని స్తున్నారు. కొత్త తరహా సేద్యానికి అలవాటు పడుతున్నారు.. కేవలం వరిపైన ఆధారపడకుండా పళ్ల తోటల పెంపకం పాడి పశువుల పెంపకం పైన శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు మరింత ఆసరా దక్కాలంటే బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. పంటలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు మారాలి. చిన్న చిన్న సహాయాలు చేస్తే రైతాంగం మరింత కష్టపడి దేశంలో పురోభివృద్ధికి భాగ స్వామ్యం కాగలదు.

తెలుగు రాష్ట్రాల్లో ధాన్యరాశులు..

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడులు భారీగా పెరిగాయి.. ఈ రెండు రాష్ట్రాల్లో ముందు నుంచి పంటల దిగుబడి పెరుగుతూనే వస్తుంది. అయితే రైతులు చెమటోడ్చి పంటలు పండించినా ఆర్థికంగా మాత్రం ఎదగడం లేదు. పంటలు బాగా పండాయనడానికి నేటి ధాన్యరాశులే నిద ర్శనం. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎంత ధాన్యం దిగుబడి అయిందో గమనించాలి. ఓవైపు జోరుగా కొనుగోలు సాగుతున్నా మరోవైపు తమ ధాన్యం కొనడం లేదని రైతుల ఆందోళనలు పెరిగాయి. ఉచిత విద్యుత్‌కి తోడుగా అందుబాటులో నీరు ఉండడంతో జిల్లాల్లో ధాన్యం దిగుబడులు పెరిగాయి.

దిగుబడిలో నంబర్ వన్ రాష్ట్రం!

కాళేశ్వరం నీళ్లు లేకున్నా పంటల దిగుబడి పెరిగిందని మంత్రులు ప్రకటిస్తున్నారు. ధాన్యం దిగుబడిలో ఇప్పటికే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని చెబుతున్నారు. దిగుబడి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని భారత ఆహార సంస్థ గతంలో ప్రకటించింది. తెలంగాణ ధాన్యాగారంగా మారడానికి అన్నదాతలు పడ్డ కష్టాలను అభినందించాల్సిందే. దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ మాదిరిగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. గ్రామాల్లోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనడం ద్వారా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

పంట మార్పిడి తప్పదు..

ఈ దశలో వ్యవసాయంలో మరో విప్లవాత్మక మార్పునకు తెలంగాణ సర్కారు దృఢ నిశ్చయంతో ఉంది. కృష్ణా, గోదావరి, మూసీ నది జలాలు పుష్కలంగా లభిస్తున్న తరుణంలో పంట మార్పిడి దిశగా నియంత్రిత సాగు విధా నాన్ని అమలు చేయాలని భావిస్తోంది. గిరాకీ ఉన్న పంటలు పండించడం, డిమాండ్ ఉన్నప్పుడే పంటను మార్కెట్‌కు తేవడం నియంత్రిత వ్యవసాయ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మూస విధానం వీడి ఆదాయం పొందేలా మేఘ మధనం జరిపి జిల్లా నేలలకు అనువైన పంటలు వేసి లాభాలు గడిచేలా ప్రణాళిక రూపొందించింది.

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ

ఒకే రకమైన పంటల సాగుతో ధరలు తగ్గి రైతులు నష్టపోతున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న పంటలు పండించ డానికి రైతులు కూడా మొగ్గు చూపుతున్నారు. అవసరం ఉన్న పంటలను పండించాలన్న లక్ష్యంతో వ్యవసాయ రంగం బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది. కరోనా కష్టకాలంలో ధాన్యాగారంగా యావత్ దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. అయితే ఉభయ రాష్ట్రాల్లో కరువులు, వరదల కారణంగా కొండంత కష్టాలతో కుమిలిపోయిన అన్నదాతల జీవితాలు మాత్రం గట్టెక్కడం లేదు. రైతు భరోసా పెట్టుబడి సాయం, 24 గంటలపాటు కరెంటు సరఫరా అవుతున్నా అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. రైతుకు ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందించినప్పుడే పంటల దిగుబడికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

గుమ్మడిదారి సాయి కృష్ణ

90142 52482

Next Story