జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా..

by Ravi |   (  Updated:2025-07-09 00:46:16  IST  )

సాధారణ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలలో గౌరవ ప్రద దేశంగా

జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా..
X

సాధారణ విద్యార్థులను రాజకీయాలకు అతీతంగా దేశభక్తులుగా తీర్చిదిద్దుతూ ప్రపంచ దేశాలలో గౌరవ ప్రద దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేడర్ బె‌స్ట్ మాస్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ. స్వతంత్ర్యం వచ్చాక దేశ యువతలో బానిసత్వాన్ని తొలగించి వారిని చైత న్యం చేసేందుకు 1949 జులై 9న అఖిల భారతీయ వి ద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటైంది. నేడు 75 వసంతాలు పూర్తి చేసుకొని 76 వసంతంలోకి అడుగుపెట్టింది.

అతిపెద్ద విద్యార్థి సంఘం..!

మారుమూల గ్రామాల నుంచి మహానగరాలు వరకు విస్తరిస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ఏబీవీపీ ముందుండి పరిష్కరిస్తోంది. కేవలం విద్యార్థుల సమస్యలే కాదు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటన ఎక్కడ జరిగినా అనుక్షణం స్పందిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన ఏబీవీపీ నేడు దేశవ్యాప్తంగా విస్తరిస్తూ 35 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా విరాజిల్లుతోంది. ఏబీవీపీ అంటే ధర్నాలు, రాస్తారోకోలు, కళాశాలలు బంద్‌లు చేయడమే తెలుసు.. కానీ మరోవైపు చూస్తే విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా 'సృజన', మెడికల్ విద్యార్థుల కోసం 'మెడి విజన్', మన దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ WOSY, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం 'SEIL', గిరిజన విద్యార్థుల కోసం 'వనవాసి', పర్యావరణ పరి రక్షణ కోసం 'స్టూడెంట్ ఫర్ డెవలెప్ మెంట్' విద్యార్థుల్లో సేవాభావం పెంచేందుకు స్టూడెంట్ ఫర్ సేవ', విద్యార్థి కళాకారులను ప్రోత్సహించేందుకు 'కళామంచ్', ఐఐటీ, నిట్ స్థాయి విద్యార్థుల కోసం ‘థింక్ ఇండియా’ లా విద్యార్థులకు లా ఫోరం, క్రీడలపై ఆసక్తి గల విద్యార్థుల కోసం ఖేల్ ఇలా అనేక రకాల కార్యక్రమాలతో విద్యా ర్థులకు లీడర్ షిప్‌ను అందిస్తుంది.

సిద్ధాంతం కోసం పని చేస్తూ..

జాతీయవాద సిద్ధాంతం కోసం కాలేజీ క్యాంపస్‌లలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పుటకై 40 మందికి పైగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బలయ్యారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కార్యకర్తలు ఏనాడూ భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పని‌చేస్తూ.. నేటి తరానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఫలితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ నేటి ఏబీవీపీ కార్యకర్తలు "మీ రక్తం వృధా కాదు మీ ఆశయం ఆగిపోదు" "క్షణం క్షణం మా కణం కణం భరతమాతకే సమర్పణం", భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారు..

తెలంగాణ ఉద్యమ పోరాటంలోనూ..

మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరి, కృష్ణమ్మలు మన దిక్కు మల్లాలి అంటూ జల చైతన్య యాత్రలు, బాసర నుంచి శ్రీశైలం వరకు సస్యశ్యామల యాత్ర, నా రక్తం, నా తెలంగాణ, హరిత తెలంగాణ లాంటి నిర్మాణాత్మక ఉద్యమాలు నిర్వహించింది. మలిదశ ఉద్యమంలో 2010 జనవరిలో భారత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకురాలు సుష్మస్వరాజ్‌ను తీసుకొచ్చి లక్షమంది విద్యార్థులతో తెలంగాణ విద్యార్థి రణభేరి నిర్వహించి ఉద్యమం పట్ల దేశ ప్రజల దృష్టి కేంద్రీకరించేలా చేసింది. ఇప్పుడు పేద విద్యార్థులలో జాతీయ భావాలు నెలకొల్పేలా, అనేక విద్యారంగ సమస్యలు పరిష్కార కేంద్రంగా ఏబీవీపీ కార్యకర్తల సొంతం. రాబోయే రోజుల్లో ఏబీవీపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినూత్న కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ మహా ఉద్యమంలో విద్యార్థులంతా భాగస్వామ్యులై దేశ అభివృద్ధిలో పాలుపంచుకుందాం.

(నేడు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం)

- సభావట్ కళ్యాణ్

90143 22572

Next Story