చిన్న కుటుంబం చింత లేని కుటుంబం కాదు.. ఇప్పుడు చింతల కుటుంబం

by Ravi |   (  Updated:2025-04-25 00:30:51  IST  )

కుటుంబాలు ఎంత చిన్నవిగా ఉంటే వ్యాపారులకు అంత లాభాలు ఉంటాయి. ఒక ఉమ్మడి కుటుంబానికి ఒక ఇంటితో

చిన్న కుటుంబం చింత లేని కుటుంబం కాదు.. ఇప్పుడు చింతల కుటుంబం
X

కుటుంబాలు ఎంత చిన్నవిగా ఉంటే వ్యాపారులకు అంత లాభాలు ఉంటాయి. ఒక ఉమ్మడి కుటుంబానికి ఒక ఇంటితో పాటు ఒక టీవీ, ఫ్రిజ్ ఇలా గృహోపకరణాలు కూడా ఒక్కొక్కటి సరిపోతాయి. అదే తల్లిదండ్రుల నుండి పిల్లలు వేరుపడి కాపురాలు పెట్టడం వలన ఇవి రెట్టింపు అవు తాయి. ఇంకా భార్యాభర్తలు వేరు పడితే ఆ సంఖ్య మరింత రెట్టింపుగా మారి వ్యాపారులకు మరింత ప్రయోజనమవుతుంది. ఇలా ప్రజలు విడివిడిగా ఉండడం వలన ఆత్మీయత, అన్యోన్యతలు కరువై అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే అది హాస్పిటల్ రంగాలకు లాభమవుతుంది. ఉమ్మడి కుటుంబాలలో ఆడుతూ పాడుతూ తలా ఒక పని చేసి చిన్నదైనా, పెద్దదైనా శుభ కార్యక్రమాలకు తామే వంట చేస్తూ ఆరోగ్యకరమైన భోజనం చేసే వారు.ఇప్పుడు ప్రతి దానికి హోటల్, కేటరింగ్ లపై ఆధారపడుతున్నారు. ఒక్కరు లేదా ఇద్దరు ఉన్న కుటుంబాలలో ఎక్కువ శాతం ఇంటి బయట తింటున్నారనేది వాస్తవం.

చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అనే నానుడి ఉంది. కానీ ఉమ్మడి కుటుంబంతోనే ఆర్థిక ప్రయోజనాలు అధికం. బామ్మ, తాతయ్యల కథలు, కబుర్లతో పెరిగిన పిల్లలలో మానసిక ఎదుగుదల బాగుంటుంది. సంస్కృతి సంప్రదాయాల పట్ల నైతిక విలువలు కలిగి ఉంటారు. బంధాల ప్రాధాన్యత తెలుస్తుంది. చిన్న చిన్న కుటుంబాలలో పిల్లలు టీవీ, సెల్‌ఫోన్‌లకు బానిసలు అవుతున్నారు. విందు, వినోదాలు, సరదాల పేరిట తల్లిదండ్రులు కూడా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఇది పిల్లల భవిష్యత్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గౌరవిద్దాం. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించుకుందాం.

- దుర్గమ్ భైతి

99590 07914

Next Story