దేశ రాజకీయాల్లో కీలక మలుపు..

by Ravi |   (  Updated:2026-05-05 00:30:47  IST  )

2026 ఐదు రాష్ట్రాల ఎన్నికలు భారత రాజకీయాల్లో కీలక మలుపు తిప్పాయి. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలన విజయం, పశ్చిమ బెంగాల్‌లో మమత పరాజయం, కేరళలో ప్రభుత్వ మార్పు వంటి పరిణామాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తున్నాయి.

దేశ రాజకీయాల్లో కీలక మలుపు..
X

2026లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజ కీయాల్లో కీలకం కానున్నాయి. తమిళనాడులో దశా బ్దా లుగా కొనసాగుతున్న రెండు పార్టీల మధ్య అధికార మార్పిడి సంప్రదాయానికి తెరపడింది. మూడో శక్తిగా అవతరించిన టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ అనూహ్యంగా అధికార పీఠాన్ని తక్కువ వ్యవధిలోనే కైవసం చేసుకోబోతున్నారు. ప్రతీ దఫాకూ అధికారం మార్చే సంప్రదా యాన్ని బద్దలు కొట్టి తిరిగి డీఎంకే‌నే పగ్గాలు చేపట్టగలదని పలువురు భావించారు. అయితే ఆ సంప్రదాయం కొనసాగింది కానీ విజేతగా కొత్త ముఖం, కొత్త పార్టీగా విజయ్ అవతరించారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు గత మూడేళ్ల నుంచే మొదలైంది. కేంద్రంలో బీజేపీ ప్రత్యేక దృష్టి, అక్కడ అధికారంలో ఉన్న మమత ఢీ అంటే ఢీ అంటూ సాగింది. నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన మమత, బలమైన బీజేపీ చేతిలో పరాజయం పాలైంది. ప్రచారంలో అక్కడి సమస్యలు, పరిష్కారాల కన్నా భావోద్వేగాలే ప్రధానంగా మారాయి.. ఇక కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పరాజయం కొంత ఊహించిందే. ఎన్నిక ఎన్నికకూ అధికారం మారడం అక్కడ కూడా సంప్రదాయమే. గత సారి మాత్రం ఇందుకు మినహాయింపు. అస్సాం, పుదుచ్చేరిలో కూడా అనుకున్నట్టుగానే బీజేపీ గెలిచింది. అక్కడి ప్రతిపక్షం బలహీనం. పుదుచ్చేరిలో కొంత బలం ఉన్నా బీజేపీ శక్తి ముందు చాలలేదు. వెరసి బీజేపీకి అదనపు మెరుపు ఈ ఎన్నికల్లో సమకూరింది. దేశంలో మరింత బలంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. తమిళ నాడులో చాలా కాలానికి ద్రవిడ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి రాష్ట్ర పగ్గాలు చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. చివరకు గెలవలేమని తెలిసినా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ ముందుకు తెచ్చి ఆ అంశంపై తాము కట్టుబడి ఉన్నామన్న రాజకీయ సందేశాన్ని ఎన్నికల ప్రచారంలో అందించింది. అలా చేయడం సరైనదేనా? అని ఆలోచించలేదు. అయితే యుద్ధంలోనూ, రాజకీయాల్లోనూ ఏదైనా సరైందే అని అనుకోవడం ఆధునిక వ్యూహం. ఏది ఏమైనా రానున్న దేశ రాజకీయాల దిశని ప్రభావితం చేసే ఫలి తాలివి. విజేతలకు అభినందనలు.

-డా. డి.వి.జి.శంకర రావు,

94408 36931

Next Story