- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేరుకే ప్రజాస్వామ్య దేశం.. పత్రికా స్వేచ్ఛ ఏది?
పత్రికలు ప్రజాస్వామ్య సౌదానికొక మూలస్తంభం లాంటివి. కావున పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరం. ఈ నేపథ్యంలో మే 3న అంతర్జాతీయ పత్రికా దినోత్సవం

పత్రికలు ప్రజాస్వామ్య సౌదానికొక మూలస్తంభం లాంటివి. కావున పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరం. ఈ నేపథ్యంలో మే 3న అంతర్జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంద ర్భంగా మీడియా స్వేచ్ఛను, ప్రాథమిక సూత్రాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్‌ను ప్యారిస్‌లోని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రతి ఏటా విడుదల చేస్తుంది. ఈ సంస్థ మొన్న విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకుగాను భారత్ 151 స్థానంలో నిలిచింది. గతేడాది 159 స్థానంలో కన్నా ఈ సారి ఈ ర్యాంకు కొంచెం మెరుగుపడింది. కానీ పొరుగు దేశాలైన నేపాల్ (90వ స్థానం), మాల్దీవులు (104), శ్రీలంక (139), బంగ్లాదేశ్ (149) కంటే భారత్ దిగువనే ఉంది. ఈ సూచీలో నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్‌లు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. ఎరిత్రియా అట్టడుగున ఉంది. అయితే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పత్రికా స్వేచ్ఛ "చాలా తీవ్రమైన" కేటగిరీలోనే ఉందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తెలిపింది. అంతేకాకుండా మీడియా రాజకీయ నాయకుల యాజమాన్యంలో ఉండి, పత్రికా స్వేచ్ఛకు ముప్పు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఉందన్నది. మరోవైపు గతేడాది యునెస్కో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ జర్నలిస్టులపై హింస పెరుగుతున్నట్లు ఓ నివేదికను విడుదల చేసింది. గత 15 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ జర్నలిస్టులలో 44 మంది జర్నలిస్టులు చంపబడ్డారని పేర్కొన్నది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక హత్యల సంఖ్యను చూపిస్తుంది. భూగోళ సంరక్షణలో పర్యావరణ నష్టంపై వార్తలు వెలికి తీయడమే దీనికి కారణం. ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యం అంతే అవసరం. కావున ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సం ఘాలు, ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.
- సంపత్ రమేష్ మహారాజ్
79895 79428






