వికసితం వైపు పయనం

by Ravi |   (  Updated:2025-02-02 00:30:21  IST  )

మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ‘ఉజ్వల తార’గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు

వికసితం వైపు పయనం
X

మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ‘ఉజ్వల తార’గా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత ఆర్థిక వృద్ధి అంచనా వేయబడటమే ఇందుకు కారణం. సుసంపన్న, సార్వజనీన భారతం దిశగా దేశ పౌరులందరికీ మెరుగైన జీవన నాణ్యత, ఆత్మ గౌరవంతో కూడిన జీవనానికి భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చెస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2025 కేంద్ర బడ్జెట్‌లో, విద్య, ఆరోగ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి, ఆర్థిక వృద్ధికి మూడవ కీలక ఇంజిన్‌గా ప్రజలు, ఆవిష్కరణలలో పెట్టుబడులపై దృష్టిసారించారు. చిన్నారులకు, గర్భిణులకు, తల్లులకు, కౌమార బాలికలకు పోషకాహారం అందించే పథకం. విద్య, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని విస్తరించడం, అదనపు మెడికల్ కాలేజీ సీట్లు, 200 డే క్యాన్సర్ కేర్ సెంటర్లు, మూడు కృత్రిమ మేధ రీసెర్చ్ సెంటర్ల ఎర్పాటుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరపడం వల్ల విద్య వైద్య సౌకర్యాలు మెరుగుపడగలవు.

రైతులకు మద్దతు

రైతులకు సబ్సిడీ కింద ఇచ్చే క్రెడిట్ పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు పెంచడం, పప్పు ధాన్యాలు, పత్తి వంటి పంటల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక పథకాలు, బొమ్మల తయారీకి ఊతమివ్వటం, పురాతత్వ ప్రతుల పునరుద్దరణకు సాయం. దేశ సాంస్కృతిక వికాసానికి, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి, ఆటోమొబైల్ రంగానికి పౌర విమానయాన రంగానికి చేయూతనిచ్చే చర్యలు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుష్యులోయ్ అన్న గురజాడ ఆడుగుజాడలో రూపొందినదే 2025-26 బడ్జెట్.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story