'ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వరకు కుదించుకుపోవచ్చు'

by  |
ఆర్థికవ్యవస్థ 7.5 శాతం వరకు కుదించుకుపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 5 శాతం నుంచి 7.5 శాతం మధ్య కుదించుకుపోయే అవకాశం ఉందని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ విర్మానీ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9 శాతం నుంచి 11 శాతం వరకు వృద్ధిని సాధించవచ్చని తెలిపారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన వర్చువల్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, రాబోయే బడ్జెట్‌లో భారత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ విధానాలను తీసుకురావాలని సూచించారు.

‘కరోనా మహమ్మారి అనంతరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు విధానపరమైన సంస్కరణలు అవసరమవుతాయని అరవింద్ విర్మానీ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 75 శాతం వస్తు, సేవలకు 15 శాతం మేర జీఎస్టీ రేటు అవసరముందని అరవింద్ విర్మానీ అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకమ మెరుగైనదని, అలాగే ఉపాధి కల్పించే ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ ఎక్కువ ఖర్చు చేయాలని, భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన సూచించారు.



Next Story