- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గత మూడేళ్లుగా ఆ గ్రామంలో మట్టి వినాయకులే
<p>దిశ, కామారెడ్డి రూరల్ : వినాయకచవితి సందర్భంగా పెద్ద పెద్ద గణపతులు, వివిధ రకాల డిజైన్లతో చేసిన గణపతిలను ఎంచుకోవడంలో భక్తులు పోటీ పడ్డారు. కానీ, ఆ గ్రామంలో కేవలం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, పర్యావరణం కాలుష్యం కాకుండా కాపాడుతున్నారు. ఇది ఎక్కడో కాదు.. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో గత మూడేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. గ్రామంలో 14 యువజన సంఘాలతో పాటు ఇంటింటికి కూడా మట్టి […]</p>

దిశ, కామారెడ్డి రూరల్ : వినాయకచవితి సందర్భంగా పెద్ద పెద్ద గణపతులు, వివిధ రకాల డిజైన్లతో చేసిన గణపతిలను ఎంచుకోవడంలో భక్తులు పోటీ పడ్డారు. కానీ, ఆ గ్రామంలో కేవలం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, పర్యావరణం కాలుష్యం కాకుండా కాపాడుతున్నారు.
ఇది ఎక్కడో కాదు.. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో గత మూడేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. గ్రామంలో 14 యువజన సంఘాలతో పాటు ఇంటింటికి కూడా మట్టి గణపతులనే ప్రతిష్టించడం గమనార్హం. గత ఏడాది కరోనా సమయంలో కూడా గ్రామస్తులు అంతా కలిసి ఒకే ఒక మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గ్రామ సర్పంచ్ రవితేజ గౌడ్ యువకుడు కావడంతో తోటి యువకులను, గ్రామస్తులను ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ గణపతులను ప్రతిష్టించడం వల్ల జరిగే అనర్ధాలు, వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పించి.. మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని కోరారు. దీంతో గ్రామస్తులంతా.. దీనికి కట్టుబడి మట్టి వినాయక విగ్రహాలను పూజిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.






