- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో ఎక్కడున్నాఓటేయ్యచ్చు..
<p> ఇకమీదట దేశంలో ఎక్కుడున్నాఓటు హక్కును వినియోగించుకోవచ్చు.అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్నిమద్రాసు-ఐఐటీ విద్యార్థులు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొంతమంది తమ దైనందిన జీవితంలో ఉండే బిజీ వలన ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. దానికి కారణం ఓటు వేసే ప్రాంతానికి దూరంగా ఉండటం, సెలవు తీసుకొని వెళ్లేందుకు వీలుపడకపోవడం. దీంతో ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్నిదేశంలోని నగరవాసులు కోల్పొతున్నారు. అలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల […]</p>

ఇకమీదట దేశంలో ఎక్కుడున్నాఓటు హక్కును వినియోగించుకోవచ్చు.అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్నిమద్రాసు-ఐఐటీ విద్యార్థులు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొంతమంది తమ దైనందిన జీవితంలో ఉండే బిజీ వలన ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. దానికి కారణం ఓటు వేసే ప్రాంతానికి దూరంగా ఉండటం, సెలవు తీసుకొని వెళ్లేందుకు వీలుపడకపోవడం. దీంతో ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశాన్నిదేశంలోని నగరవాసులు కోల్పొతున్నారు. అలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఐటీ మద్రాసు సహకారంతో ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోందని సీఈసీ సునీల్ అరోరా తెలిపారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఢిల్లీలో ఉన్నవ్యక్తి కూడా తన ఊరిలో ఉన్న ఓటరు జాబితా ప్రకారం ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే తమ దగ్గరలోని ఏదైనా పోలింగ్ సెంటర్‌కు వెళ్లి వ్యక్తిగత వివరాలు తెలిపి ఓటు వేయవచ్చని సునీల్ అరోరా తెలిపారు.






