NBK111: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. దసరాకు విడుదల ఖాయం?

by Pulgam srinivas |

బాలకృష్ణ, గోపీచంద్ మాలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘NBK111’ సినిమా దసరాకే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తాజా సమాచారం.

NBK111: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. దసరాకు విడుదల ఖాయం?
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటివరకు అధికారిక టైటిల్ ప్రకటించకపోవడంతో, తాత్కాలికంగా ‘NBK111’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని మొదటగా మేకర్స్ భావించినట్లు సమాచారం. ఒకవేళ ఆ సమయానికి విడుదల సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని కూడా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరాకే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దసరా విడుదలపై మరింత విశ్వాసం వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రత్యేక అప్‌డేట్‌పై బాలయ్య అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది.

Next Story