- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న ఎబ్బనూరు సర్పంచ్
by Sridhar Babu |
<p>దిశ, వికారాబాద్: ధారూర్ మండలంలోని ఎబ్బనూరు గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు. గ్రామంలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరపడానికి గ్రామంలోని ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగి ఒక్కడే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. కరుణాకర్ మృతి చెందిన వారి పట్ల దయాదాక్షిణ్యాలు ఉండాలని, భయ బ్రాంతులకు గురి కావద్దని సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గ్రామ ప్రజలకు తెలిపారు. ఎంత అవగాహన కల్పించినప్పటికీ దగ్గరి బంధువులు […]</p>

X
దిశ, వికారాబాద్: ధారూర్ మండలంలోని ఎబ్బనూరు గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు. గ్రామంలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరపడానికి గ్రామంలోని ప్రజలెవరూ ముందుకు రాకపోవడంతో.. తానే స్వయంగా రంగంలోకి దిగి ఒక్కడే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. కరుణాకర్ మృతి చెందిన వారి పట్ల దయాదాక్షిణ్యాలు ఉండాలని, భయ బ్రాంతులకు గురి కావద్దని సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గ్రామ ప్రజలకు తెలిపారు.
ఎంత అవగాహన కల్పించినప్పటికీ దగ్గరి బంధువులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. దీంతో తానే స్వయంగా పీపీఈకిట్లు ధరించి ట్రాక్టర్‌లో స్మశాన వాటికకు తీసుకెళ్లారు. తదనంతరం అంత్యక్రియలు జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సర్పంచ్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
Next Story






