ఈటల పాదయాత్ర వాయిదా.. ఎందుకంటే..?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-15 08:57:09  IST  )

<p>దిశ, కమలాపూర్: రేపు నియోజకవర్గంలో ప్రారంభం కానున్న మాజీ మంత్రి ఈటల పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఉప ఎన్నికల దృష్ట్యా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన సూచనల మేరకు వాయిదా [&hellip;]</p>

ఈటల పాదయాత్ర వాయిదా.. ఎందుకంటే..?
X

దిశ, కమలాపూర్: రేపు నియోజకవర్గంలో ప్రారంభం కానున్న మాజీ మంత్రి ఈటల పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఉప ఎన్నికల దృష్ట్యా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన సూచనల మేరకు వాయిదా వేస్తున్నట్లు తిరిగి ఈ నెల 19వ తేదీన యధావిధిగా పాదయాత్ర కార్యక్రమం కొనసాగనున్నట్లు వారు తెలిపారు.

Next Story