నన్ను చంపేందుకు కరీంనగర్‌లో స్కెచ్ : ఈటల సంచలన ఆరోపణలు

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-19 05:33:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. హంతక ముఠాలతో చేతులు కలిపారనే సమాచారం తన వద్ద ఉందంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనికితోడు జిల్లా మంత్రే ఈ కుట్రలు చేస్తున్నారని రాజేందర్ ఆరోపించడం గమనార్హం. అయినా భయపడేది లేదని..  నరహంతకుడు నయీం చంపుతానంటేనే భయపడలేదంటూ వెల్లడించారు ఈటల. [&hellip;]</p>

Eatala-Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్ర మొదలుపెట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్ర పన్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. హంతక ముఠాలతో చేతులు కలిపారనే సమాచారం తన వద్ద ఉందంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనికితోడు జిల్లా మంత్రే ఈ కుట్రలు చేస్తున్నారని రాజేందర్ ఆరోపించడం గమనార్హం. అయినా భయపడేది లేదని.. నరహంతకుడు నయీం చంపుతానంటేనే భయపడలేదంటూ వెల్లడించారు ఈటల.

ఇదిలా ఉండగా మాజీమంత్రి ఈటల రాజేందర్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నేత,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ జెండాను ఊపి ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించారు. ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. బత్తినివానిపల్లి గ్రామం అంతా కూడా బీజేపీ జెండాలతో కాషాయవర్ణం సంతరించుకుంది .

Next Story