కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ.. కొత్త ఉద్యోగాలకు నియామకాలు

by  |
కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ..  కొత్త ఉద్యోగాలకు నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై ఆంక్షలను సడలించడం, అమ్మకాలను పెంచడం ద్వారా ఉద్యోగ నియామకాలు పుంజుకుంటున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ టీమ్‌లీజ్ వెల్లడించింది. జులై, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి టీమ్‌లీజ్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత త్రైమాసికంలో ఫ్రెషర్ల నియామకం 7 శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యంగా జూనియర్ స్థాయి సిబ్బందిని నియామకాలు సానుకూలంగా ఉన్నాయని తెలిపింది. ‘చాలా వరకు పరిశ్రమలు సెకెండ్ వేవ్ ప్రభావాన్ని అధిగమించి వృద్ధి వైపుగా పయనిస్తున్నాయి.

వాస్తవానికి పరిశ్రమల వ్యాపార వ్యూహం వేరుగా ఉంది. కొత్త ప్రణాళికలను అవలంభించే పనిలో పడ్డాయని’ టీమ్‌లీజ్ సర్వీసెస్ కో-ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ రీతుపర్ణ చక్రవర్తి చెప్పారు. జీఎస్టీ వసూళ్లు, ఈ-వే బిల్లులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, సరుకు రవాణా, పెట్రోల్ వినియోగం పెరగడంతో కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకుంటోందని, ఇది క్రమంగా కొత్త ఉద్యోగాల నియామకంపై సానుకూలంగా ఉండనున్నట్టు నివేదిక వివరించింది. హెల్త్‌కేర్, ఫార్మా, ఐటీ, విద్య, ఈ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్స్, వినియోగ వస్తువులు, వ్యవసాయ, వ్యవసాయాధారిత, రిటైల్, లాజిస్టిక్స్ అండ్ తయారీ, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా పరిశ్రమల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని టీమ్‌లీజ్ వెల్లడిచింది.


Next Story

Most Viewed