- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్ ….ఫ్లాష్… నల్లమలలో కంపించిన భూమి
<p>దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. స్థానిక ప్రజలు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల మరియు అమ్రాబాద్ మండలాలలో సోమవారం తెల్లవారుజామున 5 నుంచి 5:30 గంటల లోపు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. భూమి కదలికతో మెలకువగా ఉన్న వారు ఏం జరుగుతుందోనని ఇంటి నుండి […]</p>

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. స్థానిక ప్రజలు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల మరియు అమ్రాబాద్ మండలాలలో సోమవారం తెల్లవారుజామున 5 నుంచి 5:30 గంటల లోపు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. భూమి కదలికతో మెలకువగా ఉన్న వారు ఏం జరుగుతుందోనని ఇంటి నుండి బయటికి పరుగులు తీశారు.
అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఐదు రెండు నిమిషాలకు భూమి కదలిక 2 సెకండ్లు కనిపించిందని, ముందు బయట ఉరుములతో కూడిన పెద్ద శబ్దం వినిపించిందని ఉప సర్పంచ్ ఆలూరి కర్ణ బాబు తెలిపారు. అలాగే అచ్చంపేట పట్టణంలో ఐదు 20 నిమిషాల సమయంలో భూమి కంపించిందని, బయట పెద్ద శబ్దం వినిపించిందని, బయటికి వెళ్లి చూడగానే ఏమి కనిపించలేదని మహబూబ్ అలీ అనే వ్యక్తి తెలిపాడు.






