- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతలమయంగా రోడ్డు.. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
by Shyam |
<p>దిశ, మునుగోడు: వర్షాకలం దృష్ట్యా గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డు నుంచి ఎస్.లింగోటం వరకూ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని, దీని మూలంగా అనేక సార్లు ప్రమాదాలు జరిగాయని అధికారులు నిర్లక్ష్యం వీడి రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మార్గం గుండా రోజూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి […]</p>

X
దిశ, మునుగోడు: వర్షాకలం దృష్ట్యా గుంతలమయంగా ఉన్న రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ రోడ్డు నుంచి ఎస్.లింగోటం వరకూ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని, దీని మూలంగా అనేక సార్లు ప్రమాదాలు జరిగాయని అధికారులు నిర్లక్ష్యం వీడి రోడ్డును బాగు చేయించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మార్గం గుండా రోజూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి వందల మంది వచ్చి వెళ్తుంటారని, వెంటనే ఈ రోడ్డును బాగు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు.
Next Story






