ఐపీఎల్ నుంచి డ్వేన్ బ్రావో అవుట్

by  |
ఐపీఎల్ నుంచి డ్వేన్ బ్రావో అవుట్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ipl) 13వ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శన చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టతరం చేసుకున్నది. 10 మ్యాచ్‌లు ఆడిన చెన్నై కేవలం 3 మ్యాచ్‌లే గెలిచి అట్టడుగు స్థానంలో ఉన్నది. ఈ దశలో సీఎస్కే జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమవుతున్నట్లు ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించారు. ఈ నెల 17న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా బ్రేవో చివరి ఓవర్ వేయలేదు. అతడికి తొడకలండరాల గాయం కావడంతో మిగిలిన సీజన్‌కు దూరమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన బ్రావో 7 పరుగులు మాత్రమే చేయగా, 6 వికెట్లు తీశాడు. ఇప్పటికే జట్టు సమతుల్యం దెబ్బతిన్నది. బ్రావో లేకుండే జట్టుకు మరిన్ని కష్టాలు తప్పవు.



Next Story

Most Viewed