హుజూరాబాద్ అభ్యర్థులను ఒంటరి చేసిన దసరా.. సొంత ఇండ్లకు రాజకీయ నేతలు

67

దిశ ప్రతినిధి, కరీంనగర్: కార్ల హారన్ల మోతలు, వీఐపీల కాన్వాయ్‌లతో కిక్కిరిసి పోయిన హుజూరాబాద్ ప్రశాంత వాతావరణానికి చేరుకుంది. నిరాటంకంగా సాగిన ప్రచార హోరుతో సందడి సందడిగా ఉన్న ఈ సెగ్మెంట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. సద్దుల బతుకమ్మ, విజయ దశమి వేడుకల పుణ్యమా అని హుజూరాబాద్‌లో తాత్కాలిక బ్రేకు పడింది. ఉప ఎన్నికల కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంతో దద్దరిల్లిపోతున్న ప్రజలకు కాస్తా ఉపశమనం దొరికినట్టయింది. ఆయా పార్టీల నాయకులు పండుగల కారణంగా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేకు పడినట్టయింది.

మిగిలింది అభ్యర్థులే

అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర బాధ్యులందరూ కూడా తమ ప్రాంతాలకు వెళ్లిపోగా ఒకరిద్దరు నాయకులు నియోజకవర్గంలో పర్యటించారు. బీజేపీ పార్టీకి చెందిన ఇన్‌చార్జీలు కూడా వెళ్లిపోయారు. కొంతమంది నాయకులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అంతగా ప్రచార హోరు మాత్రం కనిపించలేదు. స్థానికంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌లు మాత్రమే ఉండిపోయారని చెప్పాలి. కాంగ్రెస్ క్యాండెట్ బల్మూరి వెంకట్ గురువారం ప్రచారం నిర్వహించినప్పటికీ శుక్రవారం మాత్రం నియోజకవర్గంలో అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..