ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన దుల్కర్ సల్మాన్.. వీడియో వైరల్

by Shyam |
Dulquer Salman
X

దిశ, సినిమా: హీరో దుల్కర్ సల్మాన్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. లగ్జరీ కారును డ్రైవ్ చేస్తున్న దుల్కర్.. రోడ్డుకు రాంగ్ సైడ్‌లో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ట్రాఫిక్ పోలీస్ ఇచ్చిన ‘స్టాప్ అండ్ గో బ్యాక్’ సైన్స్‌తో మళ్లీ రైట్ సైడ్‌లోకి వెళ్లాడు. కాగా ఈ ఘటనను కెమెరాల్లో బంధించిన ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. దుల్కర్ ట్రాఫిక్ రూల్స్ వయొలేట్ చేసిన రెండో వీడియో ఇదే కాగా.. లాస్ట్ ఇయర్ జులై‌లోనూ ఓ వీడియో హల్ చల్ చేసింది. కొట్టాయం – కొచ్చి రోడ్డుపై రేసింగ్‌లో పాల్గొన్న కార్లు.. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్‌లవని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్లు ఓవర్ స్పీడ్‌తో వెళ్లాయనే దానిపై సరైన ఆధారాలు లేకపోవడంతో మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కేరళ అధికారులు కేసు క్లోజ్ చేశారు.



Next Story

Most Viewed