‘సెల్యూట్’ మిషన్‌లో సల్మాన్.. సీరియస్ లుక్‌లో స్టార్ 

by Shyam |   (  Updated:2021-12-22 03:51:37  IST  )

<p>దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘సెల్యూట్’ లేటెస్ట్ పోస్టర్‌ విడుదల చేశాడు. ఇందులో ఏదో డాక్యుమెంట్‌ను టార్చ్‌ పట్టుకుని పరిశీలిస్తున్న దుల్కర్.. సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదే చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హీరో.. ‘అరవింద్ కరుణాకరన్ ఓ మిషన్‌లో ఉన్నారు. సెల్యూట్ మూవీ జనవరి 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌‌ను దుల్కర్ [&hellip;]</p>

Dulquer Salmaan
X

దిశ, సినిమా : మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘సెల్యూట్’ లేటెస్ట్ పోస్టర్‌ విడుదల చేశాడు. ఇందులో ఏదో డాక్యుమెంట్‌ను టార్చ్‌ పట్టుకుని పరిశీలిస్తున్న దుల్కర్.. సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదే చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హీరో.. ‘అరవింద్ కరుణాకరన్ ఓ మిషన్‌లో ఉన్నారు. సెల్యూట్ మూవీ జనవరి 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌‌ను దుల్కర్ తన హోమ్ బ్యానర్‌లోనే రూపొందించగా.. రోషన్ ఆండ్రూస్ డైరెక్ట్ చేశాడు. ఇక దుల్కర్ సరసన డయానా పెంటీ నటిస్తున్న సినిమాలో మనోజ్ కె. జయన్, సానియా అయ్యప్పన్, లక్ష్మీ గోపాలస్వామి, సాయి కుమార్, గణపతి ఎస్ పొదువల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story