సంగారెడ్డిలో కాల్పులకు ముందే స్కెచ్!

by Batti.Sumithra |   (  Updated:2020-11-16 08:53:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా గోవిందపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కాల్పులకు ముందు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కత్తులు, కర్రలతో దాడులు చేసుకుంటూ ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటన పై జహీరాబాద్ డీఎస్పీ శంకర్ పూర్తి వివరణ ఇచ్చారు. డీఎస్పీ శంకర్ వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన కమల్ కిషోర్‌కు జీడిగడ్డ తండాలో 31 భూమి ఉంది. అయితే, ఈ భూమిలో తమ వాటా [&hellip;]</p>

సంగారెడ్డిలో కాల్పులకు ముందే స్కెచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా గోవిందపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కాల్పులకు ముందు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కత్తులు, కర్రలతో దాడులు చేసుకుంటూ ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటన పై జహీరాబాద్ డీఎస్పీ శంకర్ పూర్తి వివరణ ఇచ్చారు.

డీఎస్పీ శంకర్ వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన కమల్ కిషోర్‌కు జీడిగడ్డ తండాలో 31 భూమి ఉంది. అయితే, ఈ భూమిలో తమ వాటా కూడా ఉందంటూ అలీ అక్బర్ అనే వ్యక్తి వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కమల్ ముందు జాగ్రత్త కోసం 31 ఎకరాల చుట్టూ సోమవారం కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఇది తెలుసుకున్న అలీ అక్బర్ అక్కడికి చేరుకొని గొడవకు దిగాడు. భూమిలో తన వంతు ఉందని పట్టుబట్టి కూర్చున్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

ఇక కమల్‌ కిషోర్‌ను భయపెట్టాలా ముందుగానే ప్లాన్ చేసిన అలీ అక్బర్ స్థానిక రౌడీ షీటర్ అయిన లాయక్‌కు ఫోన్ చేశాడు. దీంతో నిమిషాల వ్యవధిలోనే కర్రలు, కత్తులతో స్కార్పియో వాహనంలో లాయక్ దిగిపోయాడు. వెనువెంటనే అతడి అనుచరులు కారులో నుంచి దిగుతూ కమల్ కిషోర్ వర్గం పై దాడులు చేశారు. ఇరు వర్గాలు ఘర్షణ పడుతున్న సమయంలో లాయక్ ఒక్కసారిగా తుపాకీ తీసి 6 రౌండ్లు గాల్లోకి కాల్పులు చేసి అందరినీ భయపెట్టాడు. దీంతో కాల్పుల వ్యవహారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

అనంతరం లాయక్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవకు కారణమైన కమల్ కిషోర్, అక్బర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఇక పరారీలో ఉన్న లాయక్‌ కోసం 3 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని డీఎస్పీ శంకర్ వెల్లడించారు. గతంలో కూడా ఓ హత్య కేసులో లాయక్‌ నిందితుడిగా ఉన్నాడని.. అప్పుడే జహీరాబాద్ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్పులకు తెగబడిన నిందితుడిను పట్టుకొని తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Next Story