గుండెపోటుతో డీఎస్పీ అశోక్‌ మృతి

by Shyam |

<p>దిశ, న్యూస్‌ బ్యూరో: అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారుడు, తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తోన్న పి.అశోక్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మంగళ్‌హట్ రహీంపురాలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్‌లో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అశోక్ పూణేలో జరిగిన అంతర్జాతీయ మారథాన్ రన్ చాంపియన్ షిప్‌లో పాల్గొన్నారు. అంతేకుకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో జాతీయ అథ్లెటిక్ చాంపియన్ పోటీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. [&hellip;]</p>

దిశ, న్యూస్‌ బ్యూరో: అంతర్జాతీయ అథ్లెట్ క్రీడాకారుడు, తెలంగాణ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తోన్న పి.అశోక్‌ గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున మంగళ్‌హట్ రహీంపురాలోని ఆయన నివాసంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్‌లో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తోన్న అశోక్ పూణేలో జరిగిన అంతర్జాతీయ మారథాన్ రన్ చాంపియన్ షిప్‌లో పాల్గొన్నారు. అంతేకుకుండా దేశంలోని అనేక ప్రాంతాల్లో జాతీయ అథ్లెటిక్ చాంపియన్ పోటీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్నారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మయ్య, పోలీసు అధికారుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కరణ్ కుమార్, తదితరులతోపాటు పలువురు ప్రముఖులు ఆయన భౌతికాయాన్ని సందర్శించిన నివాళ్లర్పించారు.

Next Story