ఇంట్లోనే ఖర్జురా బిస్కెట్లు తయారు చేసుకోండిలా..

109

కావాల్సిన పదార్థాలు:

ఖర్జూరం -100 గ్రాములు
మైదా పిండి -200 గ్రాములు
పంచదార పొడి -150 గ్రాములు
బేకింగ్ పౌడర్ -1 టీస్పూన్
వెన్న -100 గ్రాములు
కోడి గుడ్లు -2

తయారీ విధానం :

ఎండు ఖర్జురాల గింజలను తీసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార పొడిలో వెన్న, కోడిగుడ్లను పగులగొట్టి వేయాలి. ఈ మిశ్రమాన్ని నురుగు వచ్చేంతవరకు చిలికి అందులో ఖర్జురపు పొడి, బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి. దీనిని ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత చపాతీలా చేసుకుని బిస్కెట్లుగా కోసుకుని బేక్ చేసుకుంటే ఖర్జురా బిస్కెట్లు రెడీ..

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..