- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొగత జలపాతంలో మందు పార్టీ
by Nalla Sampath Reddy |
<p>దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని చీకు పల్లి బోగత జలపాతం ప్రాంగణంలోకి మందు అనుమతి లేకపోయినప్పటికీ బొగత సందర్శన సమయం ముగిసిన తరువాత అక్కడ పనిచేసే అధికారులు మందుబాబులకు అనుమతి ఇస్తున్నారు. గురువారం సాయంత్రం సమయంలో కొందరు పర్యాటకులు జలపాతం ప్రాంగణంలో మందు పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారు. సందర్శన సమయం ముగిసిన తరువాత ఏ ఒక వ్యక్తిని కూడా అనుమతించ రాదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ […]</p>

X
దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పరిధిలోని చీకు పల్లి బోగత జలపాతం ప్రాంగణంలోకి మందు అనుమతి లేకపోయినప్పటికీ బొగత సందర్శన సమయం ముగిసిన తరువాత అక్కడ పనిచేసే అధికారులు మందుబాబులకు అనుమతి ఇస్తున్నారు. గురువారం సాయంత్రం సమయంలో కొందరు పర్యాటకులు జలపాతం ప్రాంగణంలో మందు పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశారు. సందర్శన సమయం ముగిసిన తరువాత ఏ ఒక వ్యక్తిని కూడా అనుమతించ రాదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మందుబాబులు అందజేసే ముడుపులకు తలొగ్గి అనుమతించడంతో బోగత జలపాతంలో మందు పార్టీ కొనసాగించారు. ఈ సంఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. కొందరు అధికారులు చేసే కక్కుర్తి పనికి పూర్తిగా అటవీశాఖకు తీరని మచ్చ తెచ్చిపెడుతుంది.
Next Story






