మలక్‌పేటలో కలకలం రేపిన డ్రోన్ సంచారం

by Shyam |

<p>దిశ, ఎల్బీనగర్: మలక్‌పేట్ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్‎పై సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డ్రోన్ కెమెరా సంచారం కలకలం రేపింది. ఎల్బీనగర్- ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ మధ్యలో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్‌పై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. దీంతో స్థానికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ కెమెర ద్వారా పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహించడానికి.. డ్రోన్ కెమెరా ద్వారా పరిసరాలను చిత్రీకరించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బోనాల [&hellip;]</p>

మలక్‌పేటలో కలకలం రేపిన డ్రోన్ సంచారం
X

దిశ, ఎల్బీనగర్: మలక్‌పేట్ న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్‎పై సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డ్రోన్ కెమెరా సంచారం కలకలం రేపింది. ఎల్బీనగర్- ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ మధ్యలో న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్‌పై డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. దీంతో స్థానికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ కెమెర ద్వారా పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహించడానికి.. డ్రోన్ కెమెరా ద్వారా పరిసరాలను చిత్రీకరించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బోనాల ఉత్సవాల సమయంలో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

Next Story