- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాష్.. ప్లాష్.. సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
<p>దిశ వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ‘అభా’ విమానాశ్రయంపై సాయుధ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గత 24 గంటల్లో ఇది రెండోదాడి కావటం గమనార్హం. ఇప్పటి వరకు దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత లేకున్నా.. యెమెన్ తిరుగుబాటుదారులు అయిన హౌతీలే ఈ దాడి చేశారని రియాద్ అనుమానిస్తోంది. సాయుధ డ్రోన్ వ్యవస్థలను చాలా కాలంగా ఇరాన్, యెమెన్ తిరుగుబాటుదారులకు అందిస్తోంది. 2015 […]</p>

X
దిశ వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ‘అభా’ విమానాశ్రయంపై సాయుధ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గత 24 గంటల్లో ఇది రెండోదాడి కావటం గమనార్హం. ఇప్పటి వరకు దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత లేకున్నా.. యెమెన్ తిరుగుబాటుదారులు అయిన హౌతీలే ఈ దాడి చేశారని రియాద్ అనుమానిస్తోంది. సాయుధ డ్రోన్ వ్యవస్థలను చాలా కాలంగా ఇరాన్, యెమెన్ తిరుగుబాటుదారులకు అందిస్తోంది. 2015 లో మొదలైన సనా తిరుగుబాటు ఇప్పటి వరకు ముగింపుకు రాలేదు. ఈ అంతర్యుద్ధంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు మరణించారు. మానవ చరిత్రలోనే అత్యంత విషాద పరిస్థితులు యెమెన్‌లో ఉన్నాయని ఐరాస ఇంతకు ముందే ప్రకటించింది.
Next Story






