నిద్రమత్తులో డ్రైవింగ్.. వారి ప్రాణాలు తీసింది..!

by Batti.Sumithra |

<p>దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. గుత్తి మండల కేంద్రానికి చెందిన బంగారు వ్యాపారి ఆనంద్ కుమార్ (40), డ్రైవర్ నూర్ అహ్మద్(35) తో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, అ జాగ్రత్తగా నడపడంతో ముందు వెళుతున్న లారీ ని వేగంగా ఢీకొట్టింది. [&hellip;]</p>

mahabubnagar accidentvv
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. గుత్తి మండల కేంద్రానికి చెందిన బంగారు వ్యాపారి ఆనంద్ కుమార్ (40), డ్రైవర్ నూర్ అహ్మద్(35) తో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం, అ జాగ్రత్తగా నడపడంతో ముందు వెళుతున్న లారీ ని వేగంగా ఢీకొట్టింది.

ఈ సంఘటనలో ఆనంద్, నూర్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న కొత్తకోట పోలీసులు ఎస్సై నాగశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలం నుండి మృతదేహాలను పక్కకు తీసి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story