డ్రైవర్ లెస్ ట్యాక్సీ@నొయిడా

by  |
Driverless Pod Taxis
X

దిశ, ఫీచర్స్: గతేడాది ఢిల్లీ మెట్రో రూపొందించిన ‘డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్‌’ను ఆదర్శంగా తీసుకుని… డ్రైవర్‌లెస్ ట్యాక్సీలను ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రారంభిస్తోంది. గ్రేటర్ నొయిడా నుంచి జెవర్‌లోని నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ ట్యాక్సీలు నడువనున్నాయి. కాగా ఈ పాడ్ టాక్సీల్లో(pod taxis) నలుగురి నుంచి ఆరుగురు ప్యాసింజర్స్ ప్రయాణించొచ్చు.

యూపీ సర్కారు తలపెట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1,250 -1,500 కోట్లు కాగా.. ట్యాక్సీల నిర్వహణకు యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే సంస్థలు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(DMRC)తో ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుకు కిలో మీటరుకు రూ.50 -60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఢిల్లీ మెట్రో రూపొందించే పాడ్ ట్యాక్సీలు త్వరలో నొయిడాలో అందుబాటులోకి వస్తాయని జెవర్ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నొయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ షురూ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed