క్లీనర్ పాలిట యుముడైన డ్రైవర్..!

by  |
క్లీనర్ పాలిట యుముడైన డ్రైవర్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తనతో పాటు తోడుగా ఉండే క్లీనర్‌ పట్ల లారీ డ్రైవర్ క్రూరంగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య తలెత్తిన చిన్న తగాదా వలన రాడ్డుతో క్లీనర్‌ను చితకబాదడమే కాకుండా, కత్తితో దారుణంగా పొడిచి హత్యచేశాడు. ఈ ఘటన కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్తుండగా జరిగింది.

వివరాల్లోకివెళితే.. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్‌ సైఫ్ మరియు క్లీనర్‌ రాజు నూకల లోడ్ కోసం కరీంనగర్‌కు వచ్చారు. పని పూర్తయ్యాక తిరికి కాకినాడ వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే డ్రైవర్ సైఫ్ రాజును ఇనుపరాడ్డుతో కొట్టడమే కాకుండా, కత్తితో దారుణంగా పొడిచి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని లారీలోనే వేసుకొని కొణిజర్ల పీఎస్‌లో నిందితుడు లొంగిపోయాడు. శవంతో పోలీస్‌‌స్టేషన్‌కు వచ్చిన సైఫ్‌ను చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. నిందితుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.Next Story