- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగులపై తాగుబోతుల దాడి
by Shyam |
<p>దిశ, ముషీరాబాద్: ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగులపై మద్యం మత్తులో మందుబాబులు దాడి చేసి గాయపరిచారు. ఘటన వివరాల్లోకి వెళితే… అంబర్ పేట విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయంలో విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉద్యోగులు మద్దిలేటి, శివ కుమార్‌లు ఉన్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఓమద్యం షాప్‌లో మద్యం కొనుగోలు చేసేందుకు నలుగురు మందుబాబులు వచ్చారు. కార్యాలయం మెట్లపై కూర్చుని వారు మద్యం సేవించారు. అది గమనించిన ఉద్యోగులు […]</p>

X
దిశ, ముషీరాబాద్: ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగులపై మద్యం మత్తులో మందుబాబులు దాడి చేసి గాయపరిచారు. ఘటన వివరాల్లోకి వెళితే… అంబర్ పేట విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయంలో విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉద్యోగులు మద్దిలేటి, శివ కుమార్‌లు ఉన్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఓమద్యం షాప్‌లో మద్యం కొనుగోలు చేసేందుకు నలుగురు మందుబాబులు వచ్చారు.
కార్యాలయం మెట్లపై కూర్చుని వారు మద్యం సేవించారు. అది గమనించిన ఉద్యోగులు అక్కడ కూర్చుని మద్యం సేవించ రాదని మందుబాబులకు వారు చెప్పారు. దీంతో మందుబాబులు ఆగ్రహం చెందారు. ఉద్యోగులపై మందుబాబులు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా ఘటనపై అంబర్ పేట పోలీసులకు ఉద్యోగులతో కలిసి ఏఈ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కాగా దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story






