ఐపీఎల్‌‌ కోసం ఎన్నో చానెళ్లు

by  |
ఐపీఎల్‌‌ కోసం ఎన్నో చానెళ్లు
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ (BCCI) నిర్వహించే క్యాష్ రిచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో ఇండియాలో జరగాల్సిన ఈ లీగ్, ఆరు నెలలు ఆలస్యంగా యూఏఈలో నిర్వహిస్తున్నారు. పూర్తి బయో బబుల్ (Bio Bubble) వాతావరణంలో ఈ లీగ్ నిర్వహిస్తుండటంతో ప్రేక్షకులను స్టేడియంలోనికి అనుమతించడం లేదు. దీంతో ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లు చూడాలంటే ప్రతి ఒక్కరూ టీవీ లేదా ఇంటర్నెట్‌ను ఆశ్రయించాల్సిందే.

ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేస్తున్నారు. ఆయా దేశాల్లోని ఒక్కో బ్రాడ్‌కాస్టర్‌ (Broadcaster)తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా ఐపీఎల్ (IPL) లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కరోనా తర్వాత జరుగుతున్న అతి పెద్ద క్రికెట్ లీగ్ ఐపీఎల్ కావడంతో ఈసారి టీవీల్లో ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

55కోట్లు దాటనున్న టీవీ ప్రేక్షకులు..

ఐపీఎల్‌ (IPL)ను టీవీల్లో 55 కోట్ల మంది భారతీయులు చూసే అవకాశం ఉన్నట్లు డిస్నీ స్టార్ (Disney Star) ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ అంటున్నారు. ఐపీఎల్‌కు ప్రేక్షకులు ఉండరనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అంటున్నారు. గతంలో కంటే ఈసారి ఐపీఎల్ (IPL) కోసం మరింత ఎక్కువ మంది కామెంటేటర్లను నియమించారు. ఏడు భాషల్లో ప్రత్యేకమైన ఫీడ్‌తో వివిధ చానెళ్లలో ఐపీఎల్ ప్రసారం చేయనున్నారు.

కేవలం ఇండియాలోనే 55కోట్ల మంది ఐపీఎల్ (IPL) వీక్షించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్టార్ ఇండియా 100దేశాలకు ఫీడ్‌ను పంపించనుంది. ప్రేక్షకులను ఐపీఎల్ ప్రసారాలు అందించడానికి ఇప్పటికే 700 మంది స్టార్ ఇండియా సిబ్బంది యూఏఈ చేరుకున్నారు. వీరికోసం ప్రత్యేకంగా బయో బబుల్ (Bio Bubble) ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముంబైలోని స్టార్ ముఖ్య కార్యాలయంలో 400మంది సిబ్బంది కూడా బయో బబుల్ వాతావరణంలో ఉండనున్నారు. వీరితోపాటు 90మంది కామెంటేటర్లు కూడా లీగ్ జరిగినన్ని రోజులు బయో సెక్యూర్ వాతావరణంలోనే ఉంటారు.

ఏ ప్రాంతంలో.. ఏ చానెల్‌లో:

ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్‌లో స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌ (Star Sports Channels)లో ఐపీఎల్ ప్రసారం కానుంది.

ఇంగ్లీష్ కామెంట్రీ (English Commentary)తో.. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీ ( Star Sports 1, Star Sports 1 HD, Star Sports Select 1, Star Sports Select 1 HD, Star Sports 3, Star Sports 3 HD)

హిందీ (Hindi)లో.. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ హిందీ, స్టార్ గోల్డ్, స్టార్ గోల్డ్ హెచ్‌డీ (Star Sports 1 Hindi, Star Sports 1 HD Hindi, Star Gold, Star Gold HD)

తమిళ్.. స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ్
కన్నడ.. సువర్ణ ప్లస్
బెంగాళీ.. జల్షా మూవీస్
తెలుగు.. మా మూవీస్
మరాఠి.. స్టార్ ప్రవాహ్

దూరదర్శన్‌లో కొన్ని మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. డీడీ స్పోర్ట్స్‌ (DD Sports)లో వారానికి ఒక మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రసారం అవుతుంది.

ఇతర దేశాల్లో..

ఆస్ట్రేలియా – ఫాక్స్ స్పోర్ట్స్ (Australia – Fox Sports)
యూకే, ఐర్లాండ్ – స్కై స్పోర్ట్స్ క్రికెట్ (UK, Ireland – Sky Sports Cricket)
సౌత్ ఆఫ్రికా, సహారన్ ఆఫ్రికా – సూపర్ స్పోర్ట్ (South Africa, Saharan Africa – Super Sport)
అమెరికా, కెనడా – విల్లో టీవీ (USA, Canada – Willow TV)
న్యూజీలాండ్ – స్కై స్పోర్ట్స్ ఎన్‌జెడ్ (New Zealand – Sky Sports NZ)
కరేబియన్ దీవులు – ఫ్లో స్పోర్ట్స్, ఫ్లో స్పోర్ట్స్ 2 (Caribbean Islands – Flow Sports, Flow Sports 2)
పసిఫిక్ ఐలాండ్స్ – డిజిసెల్ (Pacific Islands – Diesel)
మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, యూరోప్, సెంట్రల్ ఆసియా – బీఇన్ స్పోర్ట్స్
సింగపూర్, మలేసియా, హాంకాంగ్ – స్టార్ క్రికెట్ (Middle East, North Africa, Europe, Central Asia – Bean Sports)
శ్రీలంక – ఛానెల్ ఐ (Sri Lanka – Channel I)
ఆఫ్ఘనిస్తాన్ – రేడియో టెలివిజన్ ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan – Radio Television Afghanistan)
బంగ్లాదేశ్ – ఛానెల్ 9, ఘాజీ టీవీ (Bangladesh – Channel 9, Ghazi TV)

యాప్స్ ద్వారా..

ఇక హాట్‌స్టార్ యాప్ ద్వారా ఇండియా, అమెరికా, కెనడా, యూకే, యూరోప్, కరేబియన్ దీవులు సహా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సూపర్ స్పోర్ట్ యాప్ ద్వారా సౌత్ ఆఫ్రికాతో పాటు సహారన్ దేశాల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. యప్ టీవీ యాప్ ద్వారా మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ ఆసియాతోపాటు కొన్ని యూరోప్ దేశాల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

రేడియోలోనూ..

రేడియోల్లో కామెంట్రీ ద్వారా కూడా మ్యాచ్ ప్రసారం చేయనున్నారు. ఇండియాలో రేడియో మిర్చి, యూకేలో టాక్ స్పోర్ట్, యూఏఈలో 89.1 రేడియో 4 ఎఫ్ఎమ్, ఇతర ప్రాంతాల్లో క్రికెట్ రేడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లభిస్తుంది.

ఎంత ఖర్చు అవుతుంది?

ఇండియాలో ప్రతి డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ ద్వారా స్టార్ స్పోర్ట్స్ ప్రసారాలు పొందవచ్చు. ఇక హాట్ స్టార్ ప్రీమియం (Hot Star Premium) నెలకు రూ.299 లేదా ఏడాదికి రూ.1,499 చెల్లించి పొందవచ్చు. అంతేకాకుండా డిస్నీ+ హాట్ స్టార్ వీఐపీ (Disney + Hot Star VIP) సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి రూ.399 చెల్లించి పొందవచ్చు. బాల్ బై బాల్ స్కోర్ పొందాలంటే క్రిక్ బజ్ (Crick Buzz), క్రిక్ ఇన్ఫో (Cricinfo), ఐపీఎల్‌టీ20 డాట్ కామ్ (IPL2020.com) వెబ్ సైట్ ద్వారా కూడా చూడవచ్చు.


Next Story

Most Viewed