మెరుగైన వైద్య సేవలు అందించండి.. నిధుల విడుదలకు కృషి చేస్తా

116
Bayyaram PHC

దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ అబ్జర్వర్ డాక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. ఇటీవల ఎన్‌క్వాస్ ( నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) కింద ఈ ఆసుపత్రి ఎంపికైంది. ఈ క్రమంలో పీహెచ్‌సీ పరిసరాలు, పరిశుభ్రత, ఆసుపత్రి ఆవరణలో పచ్చదనాన్ని పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ క్వాలిటీ కింద ఎంపికైన బయ్యారం, గంధంపల్లి, కంబాలపెళ్లి రోగులకు క్వాలిటీగా వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు. 2019 సంవత్సరంలో నేషనల్ క్వాలిటీలో ఎంపికైనందున కేంద్రం నుండి ప్రతి ఏటా మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు.

క్వాలిటీ సేవలు, జాతి ఆరోగ్య కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిపై సమగ్ర నివేదిక పంపి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా హెల్త్ క్వాలిటీ మేనేజర్ సరిత, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ జవహర్ లాల్, స్టాఫ్‌నర్స్ ఝాన్సీరాణి, శిల్పా, రజిత, హెల్త్ అసిస్టెంట్ రామారావు, సులోచన, భాగ్యలక్ష్మి, హెచ్‌వీలు శాంత భారతి, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.