కేటీఆర్‌ను కలిసిన దత్తాత్రేయ.. ఆరోగ్య రంగంపై కీలక చర్చ

by Shyam |   (  Updated:2021-09-22 03:33:30  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్. నోరి దత్తాత్రేయ బుధవారం మంత్రి కేటీఆర్‌ను తెలంగాణభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన దత్తాత్రేయను కలవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతులపైన చర్చించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య [&hellip;]</p>

కేటీఆర్‌ను కలిసిన దత్తాత్రేయ.. ఆరోగ్య రంగంపై కీలక చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణుడు డాక్టర్. నోరి దత్తాత్రేయ బుధవారం మంత్రి కేటీఆర్‌ను తెలంగాణభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాల పాటు లక్షలాది మందికి అద్భుతమైన వైద్య సేవలు అందించిన దత్తాత్రేయను కలవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు వైద్య రంగంలో, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సా విధానాల్లో వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శనీయమైన పద్దతులపైన చర్చించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలపై కేటీఆర్ సమాచారం అందించారు. ఈ కరోనా సంక్షోభం తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ కూడా ప్రభుత్వ అరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ కార్యక్రమాలను ప్రారంభించారని కేటీఆర్ తెలిపారు.

Next Story