మీ పని చూసుకొండి: టర్కీకి భారత్ సూచన

by  |
మీ పని చూసుకొండి: టర్కీకి భారత్ సూచన
X

భారత్‌లో జమ్ముకశ్మీర్ అంతర్భాగమని, ఈ అంశంపై ఎవరి జోక్యాన్ని అంగీకరించమని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ అంశంపై టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు తైయిప్ ఎర్దొగన్ పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ సందర్భంగా జమ్ముకశ్మీర్ అంశంపై చర్చించారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ నిర్ణయానికి తమ దేశ మద్దతు ఉంటుందని టర్కీ అధ్యక్షుడు ఎర్దొగన్ ప్రకటించారు. ‘భారత అంతర్గత విషయంలో టర్కీ జోక్యం చేసుకోవద్దు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల భారత్‌కు ఉన్న ముప్పును గుర్తించాలి’ అని పాకిస్థాన్ పర్యటనక ముందే టర్కీకి భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ సూచించారు. కానీ, భారత్ అభ్యంతరాలను టర్కీ అధ్యక్షుడు ఎర్దొగన్ పట్టించుకోలేదు. శుక్రవారం కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తారు. పాకిస్థాన్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించడం గమనార్హం.



Next Story