మంత్రి హరీష్ రావుకు రూ.4 లక్షల 26 వేల విరాళం అందజేత

by Shyam |

<p>దిశ, మెదక్: కరోనా దెబ్బకు నిరుపేదల జీవనం కష్టతరంగా మారింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో వారున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. పేదలకు సాయం చేయడానికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు పలువురు స్పందించారు. సిద్ధిపేటకు చెందిన యాదవ సంఘం వారు రూ.లక్ష , ప్రముఖ వైద్యులు కొండా శ్రీనివాస్ తేజ హాస్పిటల్స్ రూ.లక్ష , [&hellip;]</p>

మంత్రి హరీష్ రావుకు రూ.4 లక్షల 26 వేల విరాళం అందజేత
X

దిశ, మెదక్: కరోనా దెబ్బకు నిరుపేదల జీవనం కష్టతరంగా మారింది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో వారున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకు రావడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. పేదలకు సాయం చేయడానికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలని మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు పలువురు స్పందించారు. సిద్ధిపేటకు చెందిన యాదవ సంఘం వారు రూ.లక్ష , ప్రముఖ వైద్యులు కొండా శ్రీనివాస్ తేజ హాస్పిటల్స్ రూ.లక్ష , నర్సింగ రావు సరేదన్, మహీంద్రా మోటార్స్ రూ. లక్ష, గన్నమనేని శ్రీదేవి – చందర్ రావు ఎంపీపీ సిద్దిపేట రూ. లక్ష, సిద్దిపేటకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బి ఎంఆర్ – మెరిడియాన్ విద్యాసంస్థల వారు రూ.50వేలు, శ్రీనిధి కన్ స్ట్రక్షన్ అమరేందర్ రెడ్డి రూ.25 వేలు సీఎంఆర్ఎఫ్ ఫండ్ కోసం విరాళాలు ప్రకటించారు . ఈ సందర్భంగా విరాళాలు ప్రకటించిన వారిని మంత్రి హరీష్ రావు అభినందించారు. కరోనా నివారణకు సాయం అందించిన మానవతా మూర్తులను సన్మానిస్తామని చెప్పారు. సిద్దిపేట యాదవ సంఘం ప్రతినిధులు శ్రీ హరి యాదవ్ , దువ్వాల మల్లయ్య , కౌన్సిలర్ ఐలయ్య యాదవ్ తదితరులు రూ.లక్ష చెక్కును మంత్రి నివాసంలో కలసి అందజేశారు. తేజ హాస్పిటల్ పక్షాన రూ.లక్ష విరాళం అందించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండ శ్రీనివాస్ ముందుకొచ్చారు.మంత్రి నివాసంలో ఆయన్నుకలిసి చెక్కును అందజేశారు.

Tags: corona, lockdown, rs 4lac26k donations, minister harish rao

Next Story