- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.50 వేలు విరాళం
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కన్న తల్లిదండ్రులు.. పురిటిగడ్డ.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను మరువకుండా సేవలు అందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అందుకోసం ఎంతోమంది తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు పుట్టిన గడ్డకు సేవలు అందిస్తూ, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు టి. మురళీధర్ గౌడ్, ఆయన సతీమణి భవానితో కలిసి […]</p>

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కన్న తల్లిదండ్రులు.. పురిటిగడ్డ.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను మరువకుండా సేవలు అందించే వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అందుకోసం ఎంతోమంది తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు పుట్టిన గడ్డకు సేవలు అందిస్తూ, తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు టి. మురళీధర్ గౌడ్, ఆయన సతీమణి భవానితో కలిసి తాను చదువుకున్న, తన తండ్రి టి వెంకటయ్య గౌడ్ ఉపాధ్యాయునిగా పనిచేసిన అడ్డాకుల మండలం కందూరు ఉన్నత పాఠశాలకు సోమవారం ఉదయం చేరుకొని తమ వంతు సహాయంగా పాఠశాల అభివృద్ధికి 50000 రూపాయలను విరాళంగా అందజేశారు. విద్యార్థులు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మునుముందు మరింత సహాయ సహకారాలు అందజేస్తామని మురళీధర్ గౌడ్ ఉపాధ్యాయులకు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మురళీధర్ గౌడ్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు.
- Tags
- mahaboobnagar






