డెలివరీలకు కోసం రివోల్ట్ మోటార్స్‌తో ఒప్పందం చేసుకున్న డొమినోస్

by  |
dominos 1
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆహార సంస్థ డోమినోస్‌ తన పిజ్జా డెలివరీలకు వినియోగిస్తున్న పెట్రోల్ బైకులను ఈ-బైకులుగా మార్చేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా డొమినోస్ సంస్థ రివోల్ట్ ఆర్‌వీ300 బైకులను ఫుడ్ డెలివరీ కోసం మార్చుకోనుంది. గత కొంతకాలంగా డొమినోస్ సంస్థ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రివోల్ట్ బైకులను ఫుడ్ డెలివరీలకు వాడుతోంది. తాజాగా దీన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యంగా మారుస్తున్నట్టు ప్రకటించింది.

‘ఈ భాగస్వామ్యంలో డొమినోస్ సంస్థతో కలిసి కొనసాగడం సంతోషంగా ఉంది. పర్యావరణానుకూల వాహనాలను వినియోగించడం ద్వారా సంస్థకు భారీ ఖర్చు తగ్గిస్తుంది’ అని రత్తన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ బిజినెస్ చైర్మన్ అంజలి రత్తన్ అన్నారు. రివోల్ట్ బైకులు వ్యాపార అవసరాలకు మాత్రమే కాకుండా వాతావరణానికి హానీ కలిగించవని రివోల్ట్ మోటార్స్ వెల్లడించింది.

రానున్న కొన్నేళ్లలో డెలివరీ మార్కెట్ విభాగంలో ఎలక్ట్రిక్ బైకులను వినియోగించేందుకు ఈ భాగస్వామ్యం ప్రోత్సాహకరంగా మారుతుందని రివోల్ట్ మొటార్స్ విశ్వాసం వ్యక్తం చేసింది. తక్కువ ఉత్పత్తి ఖర్చులకు తోడు, కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు లభిస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ బైక్ ధరలు గణనీయంగా తగ్గాయి. దీనివల్ల వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది.


Next Story