- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్‌డౌన్ ఎఫెక్ట్… ఏపీలో పెరిగిపోతున్న గృహ హింస
<p>ఆంధ్రప్రదేశ్‌లో కేవలం నాలుగు జిల్లాలు మినహా ఇతర చోట్ల కరోనా మరీ అంత ప్రమాదకరంగా లేదు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపుతో విధించిన లాక్‌డౌన్… కరోనా వైరస్ కట్టడి చేస్తున్న లాక్ డౌన్, కాపురాల్లో నిప్పులు పోస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సమయంలో గృహహింస పెరిగిపోతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ చెబుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇతర నేరాలన్నీ అదుపులోకి వచ్చినప్పటికీ గృహహింస మాత్రం పెరిగిపోతోందని మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా […]</p>

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం నాలుగు జిల్లాలు మినహా ఇతర చోట్ల కరోనా మరీ అంత ప్రమాదకరంగా లేదు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుచూపుతో విధించిన లాక్‌డౌన్… కరోనా వైరస్ కట్టడి చేస్తున్న లాక్ డౌన్, కాపురాల్లో నిప్పులు పోస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సమయంలో గృహహింస పెరిగిపోతోందని మహిళా శిశు సంక్షేమ శాఖ చెబుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇతర నేరాలన్నీ అదుపులోకి వచ్చినప్పటికీ గృహహింస మాత్రం పెరిగిపోతోందని మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, మార్చి 23 నుంచి ఏప్రిల్ 21 వరకు దిశ సెంటర్లలో 117 కేసులు నమోదైతే అందులో 45 గృహహింస కేసులు, 11 అత్యాచారం కేసులు, 3 లైంగిక వేధింపుల కేసులు, మరో 9 చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు, ఐదు మహిళలపై సైబర్ క్రైమ్ కేసులు, ఒక బాల్య వివాహం కేసు నమోదైందని ఆమె వెల్లడించారు. మిగిలినవి ఇతర కేసులని ఆమె చెప్పారు.
లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేసేందుకు రాలేని వారు ఎక్కువగానే ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారంతా కలిసి ఫిర్యాదులిస్తే మాత్రం ఈ కేసుల సంఖ్యగణీనీయంగా పెరుగుతుందని ఆమె అంచనావేశారు. ఏపీలో గృహహింస పెరగడం ఆందోళనకరమని ఆమె అన్నారు. గతంలో వారానికి 10 కేసులు వస్తే ఇప్పుడా సంఖ్య 20కి పెరిగిందని ఆమె తెలిపారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటిపట్టునుండే పురుషులు ఇంటిపనుల్లో భాగమయ్యేందుకు అంగీకరించడం లేదని, ఆల్కహాల్ దొరకకపోవడం, వ్యాపకాలు లేకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో మహిళలపై హింసకు పాల్పడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తమకు ఫిర్యాదులందగానే భర్తలకు, ఇతర కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఆమె తెలిపారు. శాలరీ కట్, ఉద్యోగాలు కోల్పోవడం వంటివి కూడా వారిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని అమె అంచనావేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు అసహనాన్ని భార్యలపై చూపుతున్నారని ఆమె అన్నారు.
Tags: corona effect, lockdown consequences, 498(a) cases, ap, kritika shukla women and child welfare






