- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాలర్ శేషాద్రికి కరోనా సోకిందా? : ఎస్వీ బద్రి
<p>దిశ, ఏపీ బ్యూరో: టీటీడీలో డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంట నిజమేనా? ఆయనను చెన్నై అపోలోకి తరలించారట ఎంతవరకు నిజం? అంటూ ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించిన వ్యక్తిపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల అంతర్గత రాజకీయాలతో వేడెక్కుతోంది. రెండు వర్గాలుగా విడివడిన అర్చక వర్గం పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో చులకనవుతోంది. తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ […]</p>

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీలో డాలర్ శేషాద్రికి కరోనా సోకిందంట నిజమేనా? ఆయనను చెన్నై అపోలోకి తరలించారట ఎంతవరకు నిజం? అంటూ ట్విట్టర్ మాధ్యమంగా ప్రశ్నించిన వ్యక్తిపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల అంతర్గత రాజకీయాలతో వేడెక్కుతోంది. రెండు వర్గాలుగా విడివడిన అర్చక వర్గం పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో చులకనవుతోంది. తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఎస్వీ బద్రి తన ట్విట్టర్ వేదికగా, ‘డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? కరోనా నేపథ్యంలో కైంకర్యాలన్నీ ఏకాంతంలోనే నిర్వహించాలనే ఒక మంచి సలహాను జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు వినడం లేదు? కరోనా బారిన పడిన జీయంగార్లు ఎలా ఉన్నారు? తక్షణమే సరైన చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి’ అంటూ ట్వీటారు. అంతటితో ఆగకుండా ఈ ట్వీట్‌ను సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్‌లను ట్యాగ్ చేశారు. ఇది టీటీడీలో కలకలం రేపింది. కాగా, తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకి ఎస్వీ బద్రి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
డాలర్ శేషాద్రి కూడా రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తాజగా టెస్ట్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో బద్రి ట్విట్టర్ ద్వారా డాలర్ శేషాద్రి గురించి కామెంట్లు చేశారు. దీనిపై డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు ఇప్పటి వరకు మూడుసార్లు కరోనా టెస్టులు నిర్వహించారని… అన్ని పరీక్షల్లోనూ నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ తనను మానసికంగా వేధించేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. బద్రి ట్వీట్లతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. మరోపైపు ఎపిడెమిక్ చట్టం కింద బద్రిపై చర్యలు తీసుకోవాలని టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదుతో పోలీసులకు బద్రిపై టీటీడీ ఫిర్యాదు చేసింది.






