- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ విజేతలుగా డోడిగ్, పొలసెక్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను ఇవాన్ డొడిగ్, ఫిలిప్ పొలసెక్ జోడి గెలుచుకుంది. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ రాజీవ్ రామ్, జో సల్సిబరీ జోడీపై 6-3, 6-4 తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. ఇది డొడిగ్, పొలసెక్ జోడీకి తొలి గ్రాండ్‌స్లామ్ కావడం గమనార్హం. క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్ 2015లో మార్సెలో మేలోతో కలసి ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ గెలుచుకున్నాడు. కాగా, పొలసెక్ 2018లో తన కెరీర్‌కు […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్‌ను ఇవాన్ డొడిగ్, ఫిలిప్ పొలసెక్ జోడి గెలుచుకుంది. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ రాజీవ్ రామ్, జో సల్సిబరీ జోడీపై 6-3, 6-4 తేడాతో గెలుపొంది చాంపియన్లుగా నిలిచారు. ఇది డొడిగ్, పొలసెక్ జోడీకి తొలి గ్రాండ్‌స్లామ్ కావడం గమనార్హం. క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్ 2015లో మార్సెలో మేలోతో కలసి ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ గెలుచుకున్నాడు. కాగా, పొలసెక్ 2018లో తన కెరీర్‌కు 2018లో రిటైర్మెంట్ ప్రకటించినా.. తిరిగి ర్యాకెట్ పట్టాడు. తాజాగా డోడిగ్‌తో కలసి తొలి గ్రాండ్‌స్లామ్ గెలుచుకున్నాడు. కాగా, ఓడిన జోడీలోని రాజీవ్ రామ్ శనివారం బార్బోరా క్రెజికోవాతో కలసి మిక్స్‌డ్ టైటిల్ విజేతగా నిలవడం గమనార్హం.
Next Story






