- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీనామాలు వెనక్కి.. విధుల్లో చేరిన డాక్టర్లు
<p>దిశ, నిజామాబాద్ వైద్యులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు ఫలించాయి. రాజీనామాను వెనక్కి తీసుకుని విధుల్లో చేరడానికి ఆరుగురు వైద్యులు అంగీకారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆరుగురు రాజీనామా చేసిన విషయం విధితమే. వారితో కలెక్టర్ శరత్‌కుమార్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు కలెక్టర్‌ను కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, […]</p>

దిశ, నిజామాబాద్ వైద్యులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జరిపిన చర్చలు ఫలించాయి. రాజీనామాను వెనక్కి తీసుకుని విధుల్లో చేరడానికి ఆరుగురు వైద్యులు అంగీకారం తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆరుగురు రాజీనామా చేసిన విషయం విధితమే. వారితో కలెక్టర్ శరత్‌కుమార్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్లు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు కలెక్టర్‌ను కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, సూపరిండెంట్ హామీ ఇవ్వడంతో రాజీనామాలను వెనక్కి తీసుకుని విధుల్లో చేరుతామని వైద్యులు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోతురే, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, అజయ్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.
Tags: Nizamabad, collector, sharath, doctors, resign






