- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ వైద్యుడు లక్ష్మారెడ్డి మృతి.. మంత్రి సంతాపం
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు మర్రి లక్ష్మారెడ్డి మృతిచెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సెంచరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. లక్ష్మారెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన తనయుడు ప్రముఖ యూరాజిలిస్ట్ డాక్టర్ రాజేందర్ […]</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేటకు చెందిన ప్రముఖ వైద్యుడు మర్రి లక్ష్మారెడ్డి మృతిచెందారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురై హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సెంచరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. లక్ష్మారెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన తనయుడు ప్రముఖ యూరాజిలిస్ట్ డాక్టర్ రాజేందర్ రెడ్డిని మంత్రి ఓదార్చారు.
Next Story






