- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి ఫిర్యాదు చేయడం సరికాదు: తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ
<p>దిశ, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా రోగులకు సరైన చికిత్స చేయడంలేదని, పరీక్షలు చేయడం లేదంటూ డాక్టర్స్ ఫర్ సేవా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం సరికాదని, ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఎవర్ని కించపరిచినా సహించేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డిలు బుధవారం […]</p>

దిశ, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా రోగులకు సరైన చికిత్స చేయడంలేదని, పరీక్షలు చేయడం లేదంటూ డాక్టర్స్ ఫర్ సేవా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం సరికాదని, ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమని తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఎవర్ని కించపరిచినా సహించేది లేదని హెచ్చరించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. రమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డిలు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పేషెంట్లకు వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా నివారణకు చికిత్స, పరీక్షలు నిర్వహించడం లేదని చెప్పడం ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్ నర్సులను, పారా మెడికల్ సిబ్బందిని చులకన చేయడమేనని అన్నారు. కష్ట కాలంలో కరోనా రోగులకు చికిత్స చేయడానికి ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి కూడా ముందుకు రాలేదన్నారు. ఇలాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తోన్న ప్రభుత్వ వైద్యులు, ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమైందన్నారు. ఈ విషయాన్ని హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ, ప్రభుత్వ డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి స్టాఫ్ నర్సులకు సరైన రక్షణ పరికరాలు అందుబాటులో లేవంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు కేంద్రానికి ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని అనడానికి 10 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వడమే నిదర్శనం అన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే కరోనా పరీక్షలు చేస్తన్నట్టు తెలియజేశారు. గచ్చిబౌలి లో టిమ్స్ ఆసుపత్రిలో 1500 పడకలు, వెంటిలేటర్లతో సర్వం సిద్దమై అందుబాటులోకి వచ్చిందన్నారు. కరోనా రోగుల కోసం ఆస్పత్రులలో సౌకర్యాలను మెరుగుపర్చి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి విపత్కార పరిస్థితులను అయినా.. ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వెంటనే తప్పుడు నివేదికలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలంగాణ హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ కన్వీనర్, ప్రభుత్వ వైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పుట్ల శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు జూపల్లి రాజేందర్, కో-ఆర్డినేటర్ డాక్టర్ నరహరి పాల్గొన్నారు.
Tags: Corona Effect, Government Doctors Association, Telangana Health and Medical JAC






