గీతం స్కాలర్ సంతోషి మిశ్రా కి డాక్టరేట్ 

by  |
గీతం స్కాలర్ సంతోషి మిశ్రా కి డాక్టరేట్ 
X

దిశ, పటాన్‌చెరు: సరళ లేదా కఠినమైన సాగే గుణం ఉన్న షీట్ మీదుగా నానో ఫ్లూయిడ్ ప్రవాహం యొక్క వేడి, సామూహిక బదిలీకి సంఖ్యాపరమైన పరిష్కారాలు అనే అంశంపై సంతోషి మిశ్రా అధ్యయనం, విశ్లేషణ చేసింది. దీనిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినందుకు గాను పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అప్లైడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని సంతోషి మిశ్రాను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణితశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కె.గోవర్ధన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు.

నానో ఫ్లూయిడ్ యొక్క వేడి, సామూహిక బదిలీ లక్షణాలను సంఖ్యాపరమైన పరిష్కారాల ద్వారా కనుగొనడం జరిగినట్లు ఆయన తెలిపారు. సంతోషి మిశ్రా సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీ ఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవీ రామారావు, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్లు వివరించారు.


Next Story