ఉరేసుకుని వైద్యుడి ఆత్మహత్య..

by Shyam |

<p>-నలుగురు వ్యక్తుల వేధింపులే కారణం ఎల్బీనగర్‌లోని వైష్ణవి హాస్పిటల్ ఎండీ అజయ్ మంగళవారం తన ఆస్పత్రిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన హాస్పిటల్ సిబ్బందికి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు అజయ్ డైరీలో సూసైడ్ నోట్ లభించింది. ఇందులో తాను చనిపోవడానికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొన్నాడు. శివకుమార్, కరుణాకర్ రెడ్డి, మెగారెడ్డి, కొండల్ రెడ్డి అనే వ్యక్తుల మానసికంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో పొందుపరిచాడు. ఈ [&hellip;]</p>

ఉరేసుకుని వైద్యుడి ఆత్మహత్య..
X

-నలుగురు వ్యక్తుల వేధింపులే కారణం
ల్బీనగర్‌లోని వైష్ణవి హాస్పిటల్ ఎండీ అజయ్ మంగళవారం తన ఆస్పత్రిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన హాస్పిటల్ సిబ్బందికి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు అజయ్ డైరీలో సూసైడ్ నోట్ లభించింది. ఇందులో తాను చనిపోవడానికి నలుగురు వ్యక్తులు కారణమని పేర్కొన్నాడు. శివకుమార్, కరుణాకర్ రెడ్డి, మెగారెడ్డి, కొండల్ రెడ్డి అనే వ్యక్తుల మానసికంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు లేఖలో పొందుపరిచాడు. ఈ మేరకు ఆ నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అజయ్ మృతికి ఆర్థిక వ్యవహారాలే కారణమని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story