నర్స్ పై వైద్యుడి లైంగిక వేధింపులు

96

దిశ, జగిత్యాల: ప్రైవేటు అసుపత్రిలో పని చేస్తున్న సాటి నర్సు పట్ల కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కల్లూర్ రోడ్‌లోని శ్రీలక్ష్మీ అసుపత్రిని గత మూడు నెలల రోజుల క్రితం ప్రారంభించగా, ఈ మధ్యనే కొవిడ్ ఆస్పత్రిగా అనుమతులు లభించాయి. ఈ నెల ఒకటవ తేదిన హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్సు కొవిడ్ పేషంట్లకు సంబంధించిన పరీక్షల రిపోర్టులను వైద్యుడు రాజేష్‌కు చూపించేందుకు గదిలోకి వెళ్ళింది.

కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వైద్యుడు నర్సుతో నీకు జీతం ఎంత ఇస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ జీతం ఇప్పిస్తానని చెప్పి తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాని నర్సు కోరుట్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలిసులు డాక్టర్ పై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రోజున సినాఫ్ ఎఫెన్స్ క్రింద డిఎస్పీ ఆసుపత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో పనిచేసే నర్సు పైనే వైద్యుడు ఇలా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది, రోగులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..