దారుణం.. సెలైన్ బాటిల్ లో విషంతో డాక్టర్ అలా..

by Anukaran |   ( Updated:2021-12-12 08:00:08.0  )
murder
X

దిశ, బేగంపేట: సెలైన్ బాటిల్ లో విషం ఎక్కించుకొని ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేలు కు చెందిన రాజ్ కుమార్ అమీర్ పేట, శ్యాం కరణ్ రోడ్డు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. బికె గూడా లో ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.

అయితే శనివారం స్నేహితుడికి ఫోన్ చేసి నా మనసు ఏమి బాగోలేదు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తిరిగి ఆ స్నేహితుడు ఫోన్ చేసిన స్పందన లేదు. అనుమానం వచ్చిన అతడు మరో వైద్యుడు శ్రీకాంత్ కు సమాచారం ఇచ్చాడు. అతను ఇంటికి వచ్చి చూడగా రాజ కుమార్ అతని చేతికి సెలైన్ పెట్టుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు.

అనుమానం వచ్చిన అతను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెలైన్ లో విషం ఎక్కించుకున్న ట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.

Next Story

Most Viewed