ఫిట్‌నెస్ ట్రైనర్‌‌ను మోసం చేద్దామనుకున్న డాక్టర్.. ఇంతలోనే..!

by  |
ఫిట్‌నెస్ ట్రైనర్‌‌ను మోసం చేద్దామనుకున్న డాక్టర్.. ఇంతలోనే..!
X

దిశ, కూకట్‌పల్లి: డేటింగ్ యాప్ పేరుతో ఫ్యాషన్ డిజైనర్, ఫిట్‌నెస్ ట్రైనర్‌ను మోసం చేద్దామనుకున్న డాక్టర్(వివాహితుడు)ను అరెస్ట్ చేశారు కూకట్‌పల్లి పోలీసులు. సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట్‌లోని సెవెన్‌ హిల్స్‌కు చెందిన నిషిత(31) ఫ్యాషన్ డిజైనర్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తోంది. ఇదే క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో బంబిల్ డేటింగ్ యాప్‌లో తన ఫోటో‌ అప్‌లోడ్ చేసింది. ఇందులో భాగంగానే ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్న అభిరామ చంద్ర (32) నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్(నోటిఫికేషన్) వచ్చింది. తొలుత ఒకరినొకరు పరిచయం చేసుకొని చాటింగ్ ప్రారంభించారు. వీరి చాటింగ్ కాస్త పెండ్లివరకు వచ్చింది. కానీ, అభిరామ చంద్రకు ఇదివరకే వివాహం జరిగిందని తెలుసుకున్న నిషిత జీర్ణించుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో పెండ్లికి సిద్ధమవ్వడమే కాకుండా.. నమ్మించి మోసం చేయబోయాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed