- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో పెద్ద గడియారాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్ : భాగ్యనగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యం.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో అనేక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో భావితరాలకు అందించాల్సిన చారిత్రాత్మక ఆధారాలు అనేకం మరుగునపడిపోతున్నాయి. ఆ జాబితాలోకి చేరబోతున్నాయి బడా గడియారాలు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్ నేటికీ నగరంలో కనివిందు చేస్తున్నాయి. గంట గంటకు అలారం మోగుతూ నగర ప్రజలు, పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేవి. హైదరాబాద్ లో 9, సికింద్రాబాద్ […]</p>

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : భాగ్యనగరం ఎన్నో చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యం.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో అనేక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో భావితరాలకు అందించాల్సిన చారిత్రాత్మక ఆధారాలు అనేకం మరుగునపడిపోతున్నాయి. ఆ జాబితాలోకి చేరబోతున్నాయి బడా గడియారాలు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్స్ నేటికీ నగరంలో కనివిందు చేస్తున్నాయి. గంట గంటకు అలారం మోగుతూ నగర ప్రజలు, పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేవి. హైదరాబాద్ లో 9, సికింద్రాబాద్ లో 3 మొత్తం 12 చారిత్రక గడియారాలు ఉన్నాయి. సెల్ ఫోన్ల రాకతో గడియారాలు మూలన పడ్డాయి. వందేళ్ల చరిత్ర కలిగిన క్లాక్ టవర్లకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అప్పట్లో ప్రజలు సమయం తెలుసుకునేందుకు సన్ డయల్స్, ఇసుక గడియారం, నీటి గడియారాలు ఉపయోగించేవారు. నక్షత్రాల కదలికల ద్వారా సమయాన్ని గుర్తించేవారు. భారతదేశానికి 19వ శతాబ్దం వరకు గడియారాలు రాలేదు. మారిన కాలానికనుగుణంగా నగరంలో ప్రత్యేకంగా క్లాక్ టవర్లు నిర్మించారు. నగరంలోని ప్రముఖ స్మారక కట్టడాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
120 అడుగుల ఎత్తులో..
సికింద్రాబాద్ క్లాక్ టవర్‌ను 120 అడుగుల ఎతైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. దీనిని జంట నగరాల్లో వారసత్వ నిర్మా ణంగా ప్రకటించారు. 1896లో 10 ఎకరాల స్థలంలో క్లాక్‌టవర్ నిర్మించగా ఫిబ్రవరి 1, 1897 న రెసిడెంట్ సర్ ట్రెవర్ జాన్ చిచెల్ ప్లోడెన్ ప్రారంభించారు. ఈ గడియారాన్ని మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త దేవాన్ బహదూర్ సేథ్ లక్ష్మీనారాయణ్ రామ్‌గోపాల్ విరాళంగా అందజేశారు.
చార్మినార్ వద్ద
సుమారు 150 ఏళ్ల పురాతన బ్రిటీష్ గడియారం ప్రఖ్యాత చార్మినార్ స్మారక చిహ్నం నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారు. 1889లో లండన్ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి అలంకరించారు.
మహబూబ్ చౌక్ వద్ద..
లాడ్ బజార్ మహబూబ్ చౌక్ ముర్గి చౌక్ క్లాక్ టవర్‌కు 128 ఏళ్ల చరిత్ర ఉంది. 1892లో హైదరాబాద్ ప్రధాని నవాబ్ అస్మాన్ జా బహదూర్ తోటలో నిర్మించారు.
సుల్తాన్ బజార్ లో..
సుల్తాన్ బజార్ వద్ద 1865లో క్లాక్ టవర్ ను ఏర్పాటు చేశారు.
ఫతే మైదాన్ వద్ద..
ఫతే మైదాన్ క్లాక్ టవర్ 1903లో నిజాం ప్రభుత్వంలో సర్ ఖుర్షీద్ జా బహదూర్, నవాబ్ జాఫర్ యార్జంగ్ బహదూర్ నిర్మించారు.
సెయింట్ జార్జ్ చర్చి వద్ద..
1867 ఏప్రిల్ 10న ప్రారంభించిన సేయింట్ జార్జ్ చర్చిలోని క్లాక్ టవర్‌ను చీఫ్ ఇంజినీర్ జార్జ్ విలియం మారెట్ రూపొందించారు.
చౌమహల్లా ప్యాలెస్..
చౌమహల్లా ప్యాలెస్ క్లాక్ టవర్ స్మారక చిహ్నం యొక్క ప్రధాన ద్వారంపై ఖిలావత్ గడియారం ఉంది.
మొజాంజాహీ మార్కెట్ వద్ద..
మొజాంజాహీ మార్కెట్ వద్ద గడియారాన్ని 1935లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేశారు.
మోండా మార్కెట్ వద్ద..
వందఏళ్లకు పూర్వం స్థాపించబడిన మోండా మార్కెట్ వద్ద క్లాక్ టవర్ నిర్మించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..
1992లో రమేశ్వాచ్ కంపెనీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పైన ఏర్పాటు చేసిన గడి యారం నగరంలో కొత్త వాటిలో ఒకటి.
ఫలక్ నుమా ప్యాలెస్..
పల్నుమా ప్యాలెస్‌లోని క్లాక్ టవర్‌ను 2వేల అడుగుల ఎతైనకొండపై ఏర్పాటు చేశారు.
జేమ్స్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్..
జేమ్స్ స్ట్రీట్ క్లాక్ టవర్‌ను 1990లో రాజస్తాని ఆర్థిక వ్యాపారి దివాన్ బహదూర్ రామ్‌గోపాల్ సేథ్ నిర్మించారు.
ఇలా నగరంలోని పలు చోట్ల నిర్మించిన చారిత్రక గడియారాలు పని చేయకుండా పోవడంతో వాటికి మరమ్మత్తు చేసి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.






